‘2.0’ ఫస్ట్ లుక్ ఈవెంట్ కి బడ్జెట్ ఎంతో తెలుసా !
Published on Nov 17, 2016 9:38 am IST

robo2
శంకర్ – రజనీకాంత్ ల కాంబినేషన్లో ‘రోబో’ కు సీక్వెల్ గా వస్తున్న ‘2.0’ చిత్రం సుమారు రూ.350 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబందించిన ఫస్ట్ లుక్ ఆదివారం సాయంత్రం ముంబైలోని యాష్ రాజ్ ఫిల్మ్ స్టూడియోస్ లో విడుదల చేయనున్నారు. అయితే ఈ ఈవెంట్ ను సాదాసీదాగా కాకుండా కళ్ళు చెదిరే రీతిలో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. పైగా ఈ ఈవెంట్ కు డైరెక్టర్ శంకర్, రజనీకాంత్, అక్షయ కుమార్, ఏఆర్ రహమాన్, అమీ జాక్సన్ లు వస్తుండటంతో ఏర్పాట్లు మరింత ఘనంగా ఉండాలని ఈ ఈవెంట్ కోసం రూ. 6 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ ను కేటాయించారు.

కేవలం ఫస్ట్ లుక్ విడుదలకే ఇంత ఖర్చు పెడితే ఇక ట్రైలర్, ఆడియో వేడుకలకు ఇంకెంత ఖర్చు పెడతారో అని అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై లైకా ప్రొడక్షన్స్ క్రియేటీవ్ హెడ్ రాజు మహాలింగం మాట్లాడుతూ ‘ఇది గ్లోబల్ సినిమా. రూ.350 కోట్ల బడ్జెట్. అందుకే ఈవెంట్ కు కరణ్ జోహార్ హోస్ట్ గా వ్యవహరిస్తారు. ఇందులో రజనీ, అక్షయ్ కుమార్ ల త్రీడి ఫస్ట్ లుక్స్ రిలీజ్ చేస్తాం. ఈ సినిమా మార్కెటింగ్ కోసం రూ.40 కోట్లు కేటాయించాం. తమిళ అభిమానులు ఈ ఈవెంట్ ముంబైలో జరుగుతుందని ఫీలవ్వద్దు. ఇంకా ట్రైలర్, టీజర్, ఆడియో ఈవెంట్స్ చాలా ఉన్నాయి. అన్నింటినీ ఇండియాలోని ప్రముఖ కాస్మోపాలిటన్ సిటీల్లో నిర్వహిస్తాం’ అన్నారు.

 
Like us on Facebook