‘గాడ్ ఫాదర్’లో మెగాస్టార్ లుక్.. అదిరిపోయిందట!

‘గాడ్ ఫాదర్’లో మెగాస్టార్ లుక్.. అదిరిపోయిందట!

Published on Jul 4, 2022 10:00 AM IST


మోహన్ రాజా దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం చేస్తున్న సినిమా “గాడ్ ఫాదర్”. గత రెండు రోజులుగా, గాడ్ ఫాదర్ ఫస్ట్ లుక్ ఈ రోజు సాయంత్రం 05:45 గంటలకు విడుదల కానుందని మేకర్స్ సూచిస్తున్నారు. ప్రకటనకు సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన పోస్టర్లు జనాల్లో మరింత ఉత్సుకతను పెంచాయి. మెగా అభిమానులు తమ అభిమాన హీరో కొత్త లుక్ ను చూడటానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి గాడ్ ఫాదర్ ఫస్ట్ లుక్ లో చిరు ఎలా ఉంటారో చూడాలి. ఇప్పటికైతే ఉన్న సమాచారం ప్రకారం ఈ లుక్ అదిరిపోయిందట.

మలయాళ సూపర్ హిట్ మూవీ లూసిఫర్‌ కి అధికారిక రీమేక్ అయిన ఈ చిత్రంలో.. బాలీవుడ్ మెగాస్టార్ సల్మాన్ ఖాన్, సత్య దేవ్ మరియు ఇతరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ మరియు సూపర్ గుడ్ ఫిలింస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. కాగా మెగా అభిమానులకు ఫుల్ జోష్ ని ఇచ్చేలా ఈ సినిమాని తెరకెక్కించాలని దర్శకుడు మోహన్ రాజా పక్కాగా ప్లాన్ చేసుకుంటున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు