మహేష్ బాబు విజన్ పై పెరుగుతున్న అంచనాలు !
Published on Mar 6, 2018 5:15 pm IST

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న ‘భరత్ అనే నేను’ చిత్రం యొక్క ఫస్ట్ విజన్ ఇంకొద్దిసేపట్లో రిలీజ్ కానుంది. ఇప్పటికే విడుదలైన ఆడియో క్లిప్ అందరిలోనూ అమితాసక్తిని రేపగా రావబోయే విజువల్స్ లో ముఖ్యమంత్రిగా మహేష్ ఎలా ఉంటాడో చూడాలని, ఇంతకీ సినిమాలో కథానాయకుడిగా మహేష్ బాబు విజన్ ఏమిటో, అదెంత గొప్పగా ఉంటుందో తెలుసుకోవాలనే ఉత్సుకత అభిమానులు, ప్రేక్షకుల్లో ఎక్కువైపోయింది.

ఫిక్షనల్ పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఏ చిత్రం ద్వారా దర్శకుడు కొరటాల శివ వివిధ అంశాల మీద తనకున్న అవగాహన ఆధారంగా ప్రభుత్వం ఎలా నడిస్తే బాగుంటుందో చెప్పే ప్రయత్నం చేశారనే టాక్ కూడ వినబడుతోంది. డివివి. దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తుండగా బాలీవుడ్ నటి కైరా అద్వానీ ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. ఏప్రిల్ 20న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

 
Like us on Facebook