ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న “ఆ ఒక్కటీ అడక్కు”?

ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న “ఆ ఒక్కటీ అడక్కు”?

Published on May 26, 2024 12:00 PM IST

చాలా కాలం తర్వాత సీరియస్ డ్రామాస్ నుంచి బ్రేక్ తీసుకొని మళ్ళీ కామెడీ ట్రాక్ లోకి వచ్చి అల్లరి నరేష్ చేసిన లేటెస్ట్ చిత్రమే “ఆ ఒక్కటీ అడక్కు”. యంగ్ హీరోయిన్ ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా దర్శకుడు మల్లి అంకం తెరకెక్కించిన కామెడి మరియు సందేశాత్మక చిత్రం ఇది. మరి థియేటర్స్ లో ఓ మోస్తరు గానే ఆడిన ఈ చిత్రం ఇప్పుడు ఓటిటి రిలీజ్ కి సిద్ధం అవుతున్నట్టుగా బజ్ వినిపిస్తుంది.

ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు అమెజాన్ ప్రైమ్ వీడియో వారు సొంతం చేసుకోగా ఇందులో ఈ చిత్రం ఈ మే 31 నుంచి అందుబాటులోకి రానున్నట్టుగా బజ్ వినిపిస్తుంది. మరి దీనిపై అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందించగా బిగ్ బాస్ ఫేమ్ అరియనా గ్లోరీ, వైవా హర్ష తదితరులు నటించారు. అలాగే చిలక ప్రొడక్షన్స్ వారు ఈ చిత్రాన్ని నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు