రాజశేఖర్ ఇంట్రెస్టింగ్ సినిమాకి ఓటిటి నుంచి భారీ ఆఫర్స్.!

Published on Dec 3, 2021 12:00 pm IST

ఇప్పుడు ఓటీటీ సంస్థలన్నీ డైరక్ట్ రిలీజెస్ పై పడ్డాయి. కాస్త మంచి కాన్సెప్ట్ తో బజ్ ఉన్న సినిమాల్ని నేరుగా తమ ఓటీటీ వేదికలపై స్ట్రీమింగ్ కు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా చిన్న చిన్న సినిమాలు మాత్రమే నేరుగా ఓటీటీలో రిలీజ్ అవుతున్నాయి తప్ప, పెద్ద సినిమాలేవీ వీళ్లకు చిక్కడం లేదు. ఈ నేపథ్యంలో.. ఓ సినిమాపై దాదాపు అన్ని ఓటీటీలు కన్నేశాయి. అదే “శేఖర్” చిత్రం.

యాంగ్రీ యంగ్ మెన్ రాజశేఖర్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాను డైరక్ట్ రిలీజ్ కింద తీసుకునేందుకు కొన్ని ఓటీటీలు ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగా ఫ్యాన్సీ రేట్లు కూడా ఆఫర్ చేశాయి. లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం.. శేఖర్ సినిమా డైరక్ట్ స్ట్రీమింగ్ రైట్స్ కోసం (థియేటర్లలో రిలీజ్ చేయకుండా నేరుగా ఓటీటీ రిలీజ్) 22 నుంచి 25 కోట్ల రూపాయల వరకు ఆఫర్లు వచ్చినట్టు తెలుస్తోంది.

అయితే ఈ ఓటీటీ సంస్థలన్నీ శేఖర్ మూవీపై ప్రత్యేకంగా దృష్టిపెట్టడానికి రెండు రీజన్స్ ఉన్నాయి. వాటిలో ఒకటి ఈ సినిమా జానర్. ఈ జానర్ సినిమాలు ఓటీటీలో బాగా నడుస్తాయి. ఇక రెండో రీజన్ ఇది ఆల్రెడీ హిట్టయిన మలయాళ మూవీ జోసెఫ్ కు రీమేక్. కాబట్టి ఓటీటీలకు శేఖర్ మూవీ సేఫ్ బెట్ గా మారింది. దీనికితోడు శేఖర్ గ్లింప్స్ రిలీజైన తర్వాత ఈ ఆఫర్లు ఇంకాస్త ఎక్కువయ్యాయంటున్నారు.

ఇది రీమేక్ మూవీ అయినప్పటికీ కథ-స్క్రీన్ ప్లేలో మార్పుచేర్పులు చేశారు. మరీ ముఖ్యంగా తెలుగు ఆడియన్స్ కోసం సినిమాలో ఓ సర్ ప్రైజ్ కూడా ప్లాన్ చేశారంట. సినిమా చూసి మాత్రమే ఆ సర్ ప్రైజ్ ఏంటో తెలుసుకోవాలంటున్నారు. ఈ రీమేక్ మూవీకి జీవిత రాజశేఖర్ డైరక్టర్. స్క్రీన్ ప్లే విభాగం కూడా ఆమెనే చూసుకుంటున్నారు. అనూప్ రూబెన్స్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

సంబంధిత సమాచారం :