ఇంటర్వ్యూ : రాశీ ఖన్నా – రవితేజగారితో కలిసి నేను చేసిన కామెడీ చాలా బాగుంటుంది !

మాస్ మహారాజ రవితేజ నటించిన తాజా చిత్రం ‘టచ్ చేసి చూడు’. ఇందులో రాశీ ఖన్నా, సీరత్ కపూర్ లు హీరోయిన్లుగా నటించారు. ఫిబ్రవరి 2న సినిమా రిలీజ్ కానుంది. ఈ సందర్బంగా రాశీ ఖన్నా సినిమా గురించిన పలు విశేషాల్ని మీడియాతో పంచుకున్నారు. ఆ విషయాలు మీకోసం…

ప్ర) మీ క్యారెక్టర్ సినిమా ఎలా ఉండబోతోంది ?
జ) సినిమాలో నా పేరు పుష్ప. సాధారణంగా హీరోయిన్లకు కామెడీ చేయడానికి స్కోప్ ఉండదు. కానీ ఈ సినిమాలో నాకు ఆ అవకాశం దొరికింది. రవితేజకు, నాకు మంచి కామెడీ సీన్స్ ఉంటాయి.

ప్ర) మీ పెర్ఫార్మెన్స్ కు కాంప్లిమెంట్స్ ఏమైనా వచ్చాయా ?
జ) డబ్బింగ్ పూర్తికాగానే హీరో రవితేజగారు నాకు ఫోన్ చేసి చాలా బాగ్ చేశావు అన్నారు. అదే నాకు బిగ్ కాంప్లిమెంట్.

ప్ర) రవితేజగారితో వర్క్ ఎలా ఉంటుంది ?
జ) ఆయన చాలా ఎనర్జిటిక్ గా ఉంటారు. సెట్స్ లో ఎప్పుడూ సరదాగా నవ్వుతూ, నవ్విస్తూ ఉంటారు. ఆయనతో వర్క్ నిజంగా చాలా బాగుంటుంది. ఆయనతో ఇంకో సినిమా చేసే అవకాశం వచ్చినా చేసేస్తాను.

ప్ర) ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ ఇందుకోసం ?
జ) సినిమాల కోసం, నా కోసం కూడ. ముఖ్యంగా నా కోసం తగ్గాను.

ప్ర) ‘టచ్ చేసి చూడు’ ఎలా ఉండబోతోంది ?
జ) ఇదొక సిన్సియర్ పోలీసాఫీసర్ కథ. ఇందులో మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ ఉంటాయి. అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది.

ప్ర) తెలుగు బాగా నేర్చుకున్నారు. డబ్బింగ్ మీరే చెప్పుకోవచ్చు కదా ?
జ) అవును. నేను కూడా ర్ సినిమాకి, తొలిప్రేమకి డబ్బింగ్ చెప్పాలని అనుకున్నాను. కానీ టైమ్ దొరకలేదు. డబ్బింగ్ చెప్పాలంటే ఎక్కువ సమయం పడుతుంది. అందుకే కుదరలేదు.

ప్ర) ఒకవైపు గ్లామర్ రోల్స్, ఇంకోవైపు నటనకు ఆస్కారమున్న రోల్స్ చేస్తున్నారు. ఎలా ఉంది ?
జ) చాలా బాగుంది. ఎప్పుడూ ఒకే రకమైన పాత్రలు చేస్తే బోర్ అనిపిస్తుంది. అందుకే భిన్నమైన పాత్రలు చేయాలి.

ప్ర) సీనియర్, యంగ్ హీరోలు ఇద్దరూ చేయడం ఎలా ఉంది ?
జ) బాగుంది. సీనియర్ హీరోలతో వర్క్ చేసేప్పుడు వాళ్ళ నుండి చాలా నేర్చుకోవచ్చు. యంగ్ హీరోలతో నటించేప్పుడు వాళ్ళతో పాటే కొత్తవి నేర్చుకోడానికి ట్రే చేస్తుంటాను.

ప్ర) బాలీవుడ్ ప్లన్స్ ఏమైనా ఉన్నాయా ?
జ) లేదండీ. నేనైతే ఎలాంటి ప్రయత్నాలు చెయ్యట్లేదు. నాకిక్కడే బాగుంది. మంచి సినిమాలు, పాత్రలు వస్తున్నాయి. చాలా హ్యాపీగా ఉంది.