ఇంటర్వ్యూ : నారా రోహిత్ – నాకు సినిమా చేసిపెట్టమని నేను ఎవర్నీ అడగను !
Published on Oct 20, 2016 4:03 pm IST

nara-rohith
యంగ్ హీరోల్లో వరుసగా సినిమాలు చేస్తూ అన్ని రకాల జానర్లూ టచ్ చేస్తూ బిజీగా బిజీగా గడుపుతున్న హీరో నారా రోహిత్. ఆయన తాజా చిత్రం ‘జ్యోచ్యుతానంద’ సూపర్ సక్సెస్ సాదిహించగా ఆయన మరో చిత్రం ‘శంకర’ రేపు విడుదలకానుంది. ఈ సందర్బంగా ఆయన చెప్పిన విశేషాలు మీ కోసం…

ప్ర) సినిమా చాలా ఆలస్యంతా రిలీజవుతోంది. కథ పాతదైపోలేదా ?

జ) నిజమే సినిమా లేటైంది. కానీ కథ విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఎందుకంటే ఇది యూనివర్సల్ సబ్జెక్ట్. పెద్దగా ఇబ్బందేమీ ఉండదు. ఇది తమిళంలో 2011 లో ‘మౌనగురు’ పేరుతో రిలీజయింది. మొన్నీ మధ్య హిందీలో ‘ఆఖిరా’ గా విడుదలైంది. ఎక్కడా కథ పరంగా అయితే ఇబ్బంది రాలేదు.

ప్ర) అసలు సినిమా కథేంటి ?
జ) ఒక మంచి కుర్రాడు ఇబ్బందుల్లో ఎందుకు పడ్డాడు. ఎలా బయటకొచ్చాడు అనేదే ఈ సినిమా కథ. తప్పకుండా అందరికీ నచ్చుతుంది.

ప్ర) ఈ సినిమాలో సోషల్ మెసేజ్ ఉంటుందా ?

జ) సోషల్ మెసేజ్ అంటే పెద్దగా ఏమీ ఉండదు. కానీ ఇదొక స్టూడెంట్ కథ. మంచి కుర్రాడికి, చెడ్డ పోలీస్ ఆఫీసర్ కి మాదే జరిగే యుద్ధం లాంటిది.

ప్ర) మీ పాత్ర ఎలా ఉండబోతోంది ?

జ) ఇందులో నేను కాలేజ్ స్టూడెంట్ గా చేశాను. కొత్తగా ఉంటుంది. అంటే ఓ మంచి కుర్రాడు బాడ్ సిట్యుయేషన్ ని ఎలా హ్యాండిల్ చేశాడు అనేదే చూపిస్తాం. మొన్నీ మధ్య సినిమా చూశాను (నవ్వుతూ) ఏంట్రా బాబు.. ఇలా చేశాను అనిపించింది. నా క్యారెక్టర్ కి సరిగ్గా సరిపోయే పాత్ర అది.

ప్ర) ఎప్పుడైనా ఎవరినైనా నాటో సినిమా చేయండి అని అడిగారా ?

జ) లేదు. నేను ఇప్పటి వరకూ ఏ నిర్మాతని గాని, దర్శకుడిని గాని నాతో సినిమా చేయండి అని అడగలేదు. ఎవర్నీ అడగను కూడా.

ప్ర) మీ సినిమాలకు డబ్బు పెట్టే వాళ్ళ బ్యాక్ గ్రౌండ్ మీకుందని అంటున్నారు. మీరేమంటారు ?

జ) లేదండీ.. నాకు వెనుక ఫైనాన్సర్లు ఎవరూ లేరు. అలాంటి వారెవరూ నాకు తెలీదు. ఒకవేళ అలాంటి వారుంటే ఇన్ని చిన్న సినిమాలెందుకు చేస్తాను. ఒకేసారి అన్ని డబ్బులు పెట్టి పెద్ద సినిమా చేస్తాను కదా.

ప్ర) మీకు ఇన్ని సినిమాలు ఎలా వస్తున్నాయి ?

జ) నేను పని చేసే వాళ్ళందరూ చాలా వరకూ పరిశ్రమకు కొత్తవాళ్లే. కొత్త వాళ్ళకు డేట్స్ క్లాష్ అవడం ఉండదు. అందుకే ఇన్ని సినిమాలు చేయగలుగుతున్నాను.

ప్ర) ప్రస్తుతం ఏ సినిమా చేస్తున్నారు ?

జ) ‘పండగలా దిగివచ్చాడు’ సింగిల్ డే షూట్ మిగిలుంది. ‘అప్పట్లో ఒకడుండేవాడు’ పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోంది. ‘కథలో రాజకుమారి’ షూటింగ్ లో ఉంది. ఇది జనవరిలో రిలీజవచ్చు. పవన్ సాతినేనితో ఓ సినిమా ఉంది. అది హార్రర్, కామెడీ జానర్లో ఉంటుంది.

ప్ర) ఈ మధ్య కాస్త బరువు తగ్గినట్టున్నారు ?

జ) (నవ్వుతూ) అవును. ఇంతకూ ముందంటే కథాపరమైన సినిమాలు కాబట్టి నా వెయిట్ పెద్దగా ఉన్నా బ్యాలెన్స్ అయ్యేది. కానీ ఇప్పుడు కమర్షియల్ సినిమాలు చేసున్నా కాబట్టి బరువు తగ్గాల్సిందే కదా.

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook