ఇంటర్వ్యూ : మంచు మనోజ్ – ఆ పరిస్థితుల్ని చూసి సినిమాలు వదిలేద్దామని అనుకున్నా !
Published on Nov 8, 2017 3:34 pm IST

హీరో మంచు మనోజ్ చేసిన తాజా చిత్రం ‘ఒక్కడు మిగిలాడు’ ఈ నెల 10వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్బంగా ఆయన మీడియాతో చిత్రం గురించి మాట్లాడారు. ఆ విశేషాలు మీకోసం..

ప్ర) సినిమా ఎలా ఉండబోతోంది ?
జ) ఈ సినిమా చాలా ప్రభావవంతంగా ఉండబోతోంది. కామెడీ, పాటలు లేకుండా చాలా సీరియస్ గా సాగే చిత్రమిది. ఒక విషయాన్ని ఎన్నో భావోద్వేగాలతో చెప్పడం జరిగింది.

ప్ర) సినిమాలో మీ పాత్ర గురించి చెప్పండి ?
జ) ఇందులో ఎల్టీటీఈ ప్రభాకరన్, స్టూడెంట్ లీడర్ పాత్రల్లో నటించాను. రెండూ కూడా తీవ్రమైన భావోద్వేగాలున్న పాత్రలు. వాటిలో ఎలివేషన్ సీన్లు, హీరోయిక్ సన్నివేశాలు ఉండవు. అసలు సెకండాఫ్లో అరగంటపాటు కనబడను.

ప్ర) మరీ హీరో అరగంట పాటు కనబడకపోవడం సినిమా మీద ఎఫెక్ట్ చూపించదా ?
జ) ముందే చెప్పాను.. నా పాత్ర కథతో పాటు నడుస్తుందని, ఆ అరగంటపాటు ఒక బాట్ సీక్వెన్స్ ఉంటుంది. అది చాలా భావోద్వేగపూరితంగా ఉంటుంది. ఇప్పట్లో ఆడియన్స్ చాలా మెచ్యూర్డ్ గా ఉన్నారు. వాళ్ళు కథతో పాటే ట్రావెల్ చేస్తారు.

ప్ర) ప్రభాకరన్ గురించి రీసెర్చ్ చేశారా ?
జ) అవును. నా పాత్ర ఆయన మీదే ఆధారపడి ఉంటుంది. సన్నివేశాలు బాగా రావడానికి కొన్ని వాస్తవ సంఘటల్ని కూడా బేస్ చేసుకుని తీశాం. షూటింగ్ సమయంలో ఆయన ప్రజల కోసం ఎలా ఫైట్ చేశారో తెలిసొచ్చింది.

ప్ర) అంత బరువైన భావోద్వేగాలున్న పాత్రలో నటించడం కష్టంగా అనిపించలేదా ?
జ) నేనిప్పటి వరకు చేసిన సినిమాల్లో ఇదే తీవ్రమైన పాత్ర. ఆ పాత్ర నన్ను మానసికంగా, శారీరంకంగా కదిలించి వేసింది. ఆ పాత్రలో నుంచి బయటకు రావడానికి కొన్ని నెలలు పట్టింది. ఆ పాత్ర నాపై చాలా ప్రభావాన్ని చూపింది.

ప్ర) ఆడియో వేడుకలో అంత ఎమోషనల్ గా మాట్లాడటానికి కారణం ?
జ) కొత్తవాళ్లతో సినిమాలు చేస్తే కొని సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తోంది. విడుదల వరకు అన్నీ టెంక్షన్సే. సిస్టమ్ ఈ సమస్యల్ని పరిష్కరించాలి. అన్ని సినిమాలు సులభంగా విడుదలయ్యేలా చేయాలి. ఈ పరిస్థితులు, సమాజంలోని ఇతర పరిస్థితుల్ని చూసి సినిమాలు వదిలేసి, కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేయాలనిపించింది.

ప్ర) అంటే సినిమాలు వదిలేసి రాజకీయాల్లోకి వెళతారా ?
జ) నా ఉద్దేశ్యం పాలిటిక్స్ అని కాదు. కానీ ఒకరోజు మాత్రం సమస్యల్లో ఉన్నవారికి సహాయం చేయడానికి సోషల్ సర్వీస్ మొదలుపెడతాను.

ప్ర) మీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి ?
జ) తర్వాత కొత్త దర్శకుడితో పూర్తిస్థాయి లవ్ స్టోరీ చేస్తున్నాను.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook