ఇంటర్వ్యూ : మేఘా ఆకాష్ – నా పాత్రకు కథలో ఇంపార్టెన్స్ ఉంటుంది !
Published on Aug 4, 2017 5:00 pm IST


నితిన్ – హను రాఘవపూడిల కానుకలో రూపొందిన సినిమా ‘లై’. ఈ సినిమా ద్వారా మేఘా ఆకాష్ హీరోయిన్ తెలుగువారికి పరిచయమవుతోంది. ఈ నెల 11న చిత్ర రిలీజ్ సందర్బంగా ఆమె మీడియాతో మాట్లాడారు. ఆ వివరాలు మీకోసం.

ప్ర) మీ బ్యాక్ గ్రౌండ్ ఏంటి ?
జ) మా నాన్న ఆకాష్ రాజా తెలుగువారు, అమ్మ బిందు రాజా మలయాళీ. చెన్నైలో పెరిగాను. అక్కడే విజువల్ కమ్యూనికేషన్స్ లో డిగ్రీ చేశాను.

ప్ర) ఈ సినిమా అవకాశం మీకెలా వచ్చింది ?
జ) గౌతమ్ మీనన్ గారితో చేస్తున్న సినిమా షూటింగ్ జరుగుతుండగా ఈ స్క్రిప్ట్ నా దగ్గరకు వచ్చింది. వినగానే నచ్చి ఒప్పుకున్నాను.

ప్ర) తమిళంలో ఏయే సినిమాలు చేస్తున్నరు ?
జ) తమిళంలో రెండు సినిమాలు చేస్తున్నాను. వాటిలో గౌతమ్ మీనన్, ధనుష్ ల సినిమా ‘ఎన్నై నోకి పాయుమ్ తోట’ ఒకటి. అలాగే బాలాజీ డైరెక్షన్లో ‘ఓరు పక్క కత్తి’ కూడా చేస్తున్నాను. అవి రెండు చివరి దశ పనుల్లో ఉన్నాయి.

ప్ర) వాటి కంటే ‘లై’ రిలీజవుతుందా ?
జ) అవును. ‘లై’ నా ఫస్ట్ రిలీజవుతుంది. ఒక తెలుగు సినిమా నా మొదటి సినిమా కావడం చాలా సంతోషంగా ఉంది.

ప్ర) ఈ సినిమాలో మీ పాత్ర ఏమిటి ?
జ) ఇందులో నా క్యారెక్టర్ పేరు చైత్ర. చాలా ఎనర్జిటిక్ గా ఉంటుంది. ఎప్పుడూ హుషారుగా, మాట్లాడుతూ ఉంటుంది. నిజానికి రియల్ లైఫ్ లో నేనలా ఉండను. చాలా కామ్ గా ఉంటాను.

ప్ర) కథలో మీ పాత్రకు ప్రాముఖ్యత ఉంటుందా ?
జ) నా క్యారెక్టర్ కేవలం పాటలు కోసం మాత్రమేకాదు నాకు కూడా కథలో ఇంపార్టెన్స్ ఉంటుంది. అంతేగాక ఆసక్తికరంగా కూడా ఉంటుంది.

ప్ర) నితిన్ తో వర్క్ ఎలా ఉంది ?
జ) నితిన్ తో వర్క్ చాలా బాగుంది. అర్థం కాని విషయాల్ని ఓపిగ్గా వివరించేవాడు. ఇలా చేస్తే బాగుంటుంది అని సజషన్స్ కూడా ఇస్తుంటాడు.

ప్ర) నితిన్ సెట్స్ లో ఎలా ఉంటాడు ?
జ) చాలా బాగుంటారు. డౌన్ టు ఎర్త్. కష్టపడి పనిచేస్తాడు. ఎప్పుడూ సరదాగా మాట్లాడుతుంటారు .

ప్ర) హను రాఘవపూడి డైరెక్షన్ ఎలా అనిపించింది ?
జ) హను రాఘవపూడిగారు మంచి డైరెక్టర్. ఆయన వర్క్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఆయనే నాకు చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చేవారు.

ప్ర) రామ్ సినిమాని ఎందుకు వదులుకున్నారు ?
జ) గౌతమ్ మీనన్ సినిమాతో బిజీగా ఉండటం వలన డేట్స్ క్లాష్ వచ్చి ఆ సినిమాని వదులుకోవాల్సి వచ్చింది.

ప్ర) పవన్ – నితిన్ సినిమా ఒప్పుకున్నట్టున్నారు ?
జ) అవును. ఆ స్క్రిప్ట్ నాకు బాగా నచ్చింది. అందుకే ఒప్పుకున్నాను.

ప్ర) ‘లై’ యూఎస్ షెడ్యూల్ ఎలా జరిగింది ?
జ) 75 రోజుల పాటు యూఎస్ లోని లాస్ వేగాస్, శాన్ ఫ్రాన్సిస్కో, చికాగో వంటి చోట్ల షూట్ చేశాం. కష్టమైన షెడ్యూల్. అయినా మంచి టీమ్ అవడం వలన చాలా బాగా జరిగింది.

ప్ర) మీ ఫెవరెట్ హీరో హీరోయిన్లు ఎవరు ?
జ) నాకు త్రిష అంటే చాలా ఇష్టం. బాలీవుడ్లో అలియా భట్ నచ్చుతుంది. ఎందుకంటే చిన్న వయసులోనే ఎన్నో విభిన్నమైన పాత్రలు చేస్తోంది కాబట్టి. ఇక హీరోల విషయానికొస్తే తెలుగులో పవన్ కళ్యాణ్ గారంటే ఇష్టం.

 
Like us on Facebook