“బిగ్ బాస్ 5”..ఈసారి సీజన్లో అలాంటివేం లేవ్..!

Published on Nov 5, 2021 9:00 pm IST


ఒక్క మన తెలుగు స్మాల్ స్క్రీన్ మీదనే కాకుండా ప్రపంచంలోనే అతి పెద్ద రియాలిటీ షో ఏదన్నా ఉంది అంటే అది “బిగ్ బాస్” అనే వినిపిస్తుంది. అంతలా ముద్ర వేసుకున్న ఈ గ్రాండ్ రియాలిటీ షో ఇప్పుడు తెలుగులో ఐదవ సీజన్ కూడా ఇంట్రెస్ట్ గా కొనసాగుతూ వెళ్తుంది. అయితే ఇదిలా ఉండగా గత సీజన్లతో పోలిస్తే ఈసారి ఇంకా ఏదో మిస్సవుతున్న భావన ఆడియెన్స్ లో ఉంది అనేది వాస్తవం.

ఇక వాటికి తగ్గట్టుగా ఇప్పుడు మరో విషయం కూడా క్లియర్ అవుతుంది. గత సీజన్లలో జరిగిన విధంగా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లాంటివి ఈసారి సీజన్లో అయితే ఉండవట. గతంలో ఈ వైల్డ్ ఎంట్రీస్ ఆడియెన్స్ లో కాస్త థ్రిల్ ని తెచ్చాయి. కానీ ఈసారి ఎందుకు లేవో అన్నది క్లారిటీ లేదు. ఆల్రెడీ షో సగానికి చేరుకుంది. మరి మున్ముందు ఎలా ఉంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం :

More