భారీగా విడుదల కానున్న ఇంద్రసేనా !
Published on Nov 29, 2017 11:11 pm IST

బిచ్చగాడు సినిమాతో తెలుగులో మంచి మార్కెట్ సంపాదించుకున్న విజయ్ ఆంటోనీ ఇంద్రసేనా సినిమాతోరేపు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇటివల విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌ & సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. శ్రీనివాసన్ అనే నూతన దర్శకుడు ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు.

బిచ్చగాడులో మదర్ సెంటిమెంట్ తో ఆకట్టుకున్న విజయ్ అంథోని ఇంద్రసేనా లో బ్రదర్ సెంటిమెంట్ తో విజయం అందుకోబోతున్నాడు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకేక్కబోతున్న ఈ సినిమాలో విజయ్ అన్నా తమ్ముడిగా రెండు విభిన్న పాత్రల్లో కనిపించబోతున్నాడు. అత్యధిక థియేటర్స్ లో రేపు విడుదల కానున్న ఈ సినిమా విజయ్ అంథోనికి మంచి పేరు తెచ్చిపెట్టాలని కోరుకుందాం.

 
Like us on Facebook