అఖిల్ తర్వాతి చిత్రానికి దర్శకుడు అతనేనా ?

అఖిల్ అక్కినేని టాబ్ రీ లాంచ్ చిత్రం ‘హలో’ తో నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు. చిత్రంలో ఆయన పెర్ఫార్మెన్స్ చూసిన ప్రేక్షకులు చాలా మంది సంతృప్తి చెందారు. దీంతో ఆయన తన నెక్స్ట్ ప్రాజెక్ట్ పై శ్రద్ద పెట్టారు. ఈ మధ్యే జరిగిన ఒక ప్రమోషనల్ కార్యక్రమంలో జనవరి 10న కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేస్తానని అఖిల్ చెప్పిన సంగతి తెలిసిందే.

ఈ ప్రాజెక్టును రానా దగ్గుబాటి తన సంస్థ క్వాన్ ద్వారా నిర్మించనుండటం విశేషం. ఇకపోతే తాజా సమాచారం మేరకు నటుడు ఆది పినిశెట్టి సోదరుడు, ‘మలుపు’ చిత్ర సత్య ప్రభాస్ పినిశెట్టి అఖిల్ కు కథ వినిపిస్తున్నారని తెలుస్తోంది. మరి అఖిల్ తన నెక్స్ట్ సినిమను డైరెక్ట్ చేసే అవకాశం ఆయనకే ఇస్తారేమో చూడాలి.