ఆ సినిమాలో ప్రేక్షకులను కట్టిపడేసే క్లైమాక్స్ ఉంటుందట
Published on Aug 26, 2016 10:04 am IST

jyo-achyutananda
‘ఊహలు గుసగుసలాడే’ చిత్రంతో దర్శకుడిగా ప్రత్యేక గుర్తింపు పొందిన నటుడు శ్రీనివాస్ అవసరాల. ప్రసుతం ఈ దర్శకుడు నారా రోహిత్, రెజీనా, నాగ శౌర్య జంటగా ఓ ట్రైయాంగిల్ లవ్ స్టోరీ ‘జ్యో అచ్యుతానంద’ ను తెరకెక్కిస్తున్నాడు. మొదట ట్రైలర్ విడుదలైనప్పటి నుండి అసలు క్లైమాక్స్ లో హీరోయిన్ రెజినా ఇద్దరు హీరోల్లో ఎవరికి దక్కుతుంది అనే ప్రశ్న అందరిలోనూ మొదలైంది. ఏకంగా దర్శక ధీరుడు రాజమౌళి సైతం ఇదే ప్రశ్నను ప్రస్తావించారు.

దీంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఈ ట్రైయాంగిల్ ప్రేమ కథకు దర్శకుడు అవసరాల ఎలాంటి ముగింపు ఇచ్చాడో చూడాలని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే సినీయే వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా క్లైమాక్స్ చాలా ఆసక్తిగా, ప్రేక్షకుడు ఊహించని విధంగా ఉంటుందని, ఖచ్చితంగా మంచి థ్రిల్ ను ఇస్తుందని తెలుస్తోంది. వారాహి బ్యానర్ ఫై సాయి కొర్రపాటి నిర్మించిన ఈ చిత్రానికి కళ్యాణ రమణ సంగీతం అందించారు.

 
Like us on Facebook