ఇంట్రెస్టింగ్ : ఆ ముగ్గురు టాలీవుడ్ టాప్ స్టార్స్ మూవీ టైటిల్స్ పై అందరిలో ఆసక్తి

Published on May 17, 2023 6:44 pm IST

ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ స్టార్స్ గా కొనసాగుతున్న మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ ప్రస్తుతం కెరీర్ పరంగా వరుసగా సినిమాలతో కొనసాగుతున్నారు. ఇక తాజాగా సాయి తేజ్ తో కలిసి సముద్రఖని దర్శకత్వంలో వినోదయ సిత్తం రీమేక్ లో నటిస్తున్నారు పవన్ కళ్యాణ్. ఈ మూవీని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్ సంస్థలు గ్రాండ్ గా నిర్మిస్తున్నాయి. ఇక ఈ మూవీ యొక్క అఫీషియల్ టైటిల్ ని రేపు సాయంత్రం 4 గం. 14 ని. లకు రిలీజ్ చేయనున్నట్టు నేడు మేకర్స్ ప్రకటించారు. ఈ మూవీ జులై 28న గ్రాండ్ గా విడుదల కానుంది.

ఇక మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ భారీ ఫ్యామిలీ యాక్షన్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ పై అందరిలో మంచి అంచనాలు ఉన్నాయి. సూపర్ స్టార్ నటశేఖర కృష్ణ జయంతి సందర్భంగా మే 31న ఈ మూవీ యొక్క ఫస్ట్ లుక్ టీజర్ తో పాటు టైటిల్ ని కూడా అనౌన్స్ చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ మూవీని 2024 జనవరి 133న విడుదల చేయనున్నారు. అలానే ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ప్రస్తుతం భారీ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ పాన్ ఇండియన్ మూవీ తెరకెక్కుతోంది.

జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ టైటిల్ ని మే 20న ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఇంట్రెస్టింగ్ గా అటు పవన్, ఇటు మహేష్, మరోవైపు ఎన్టీఆర్ ల లేటెస్ట్ మూవీస్ యొక్క టైటిల్స్ ప్రకటన పై వారి వారి అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా ప్రస్తుతం ఎంతో ఆసక్తి నెలకొంది. మరి ఈ క్రేజీ సినిమాలు రిలీజ్ తరువాత ఎంతమేర విజయం అందుకుంటాయో తెలియాలి అంటే మరికొన్నాళ్ళకు ఆగాల్సిందే.

సంబంధిత సమాచారం :