చిరంజీవి – శ్రీకాంత్ ఓదెల మూవీ.. కష్టంగా మార్చేసిన ‘ప్యారడైస్’

చిరంజీవి – శ్రీకాంత్ ఓదెల మూవీ.. కష్టంగా మార్చేసిన ‘ప్యారడైస్’

Published on Oct 1, 2026 12:00 PM IST

Srikanth-odela-chiru

‘దసరా’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్‌తో టాలీవుడ్‌‌లో ఒక్కసారిగా స్టార్ డైరెక్టర్‌గా మారిపోయిన శ్రీకాంత్ ఓదెల పరిస్థితి ఇప్పుడు ‘ది ప్యారడైజ్’ చిత్రంతో తలకిందులైంది. భారీ బడ్జెట్‌‌తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద తీవ్ర నిరాశపరచడంతో ఆయన తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఈ నెగిటివ్ ప్రభావం ఆయన తర్వాతి ప్రాజెక్ట్‌లపై పడే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

ముఖ్యంగా గతంలో అధికారికంగా ప్రకటించిన మెగాస్టార్ చిరంజీవి సినిమా కూడా ఇప్పుడు అయోమయంలో పడినట్లు తెలుస్తోంది. చిరు ప్రస్తుతం తన తర్వాతి ప్రాజెక్ట్‌ల కోసం వేరే ఆప్షన్లను పరిశీలిస్తుండటంతో, ఓదెలతో కాంబినేషన్ ఇప్పట్లో పట్టాలెక్కే అవకాశాలు తక్కువగానే కనిపిస్తున్నాయి.
​ప్రస్తుత పరిస్థితుల్లో శ్రీకాంత్ ఓదెల మళ్లీ తనేంటో రుజువు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. చిరుతో సినిమా ముందుకు సాగాలన్నా లేదా తన మార్కెట్ నిలబడాలన్నా ఆయన ముందుగా మరొక సినిమాతో సాలిడ్ హిట్ కొట్టాల్సి ఉంది.

అయితే ‘దసరా’ సమయంలో నాని, నిర్మాత సుధాకర్ చెరుకూరి ఆయనపై ఉంచినంత నమ్మకాన్ని, ఇచ్చిన స్వేచ్ఛను ఇప్పుడు మరొక హీరో, నిర్మాత చూపించడం అంత తేలికైన విషయం కాదు. కథ ఒప్పించడం నుండి సినిమాను విజేతగా నిలబెట్టడం వరకు శ్రీకాంత్ ఓదెల తీవ్రంగా కష్టపడాల్సిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు