మన టాలీవుడ్ సీనియర్ స్టార్ నటుడు వెంకీ మామ హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా మాటల మాంత్రికుడు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన అవైటెడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఆదర్శ కుటుంబం కోసం అందరికీ తెలిసిందే. ఇటీవల వచ్చిన ఫస్ట్ సింగిల్ మంచి రెస్పాన్స్ కూడా అందుకుంది.
ఇక సినిమా విడుదల దగ్గరకి వస్తున్న నేపథ్యంలో నిర్మాత నాగవంశీ రిలీజ్ విషయంలో ఎలాంటి డౌట్ పెట్టుకొనక్కర్లేదు అని తెలిపారు. అలాగే సినిమా ట్రైలర్ కి డేట్ ని కూడా లాక్ చేశారు. ఈ అక్టోబర్ 6న విడుదల చేస్తున్నట్టు ఖరారు చేసారు. సో సినిమా కంటెంట్ పై ఓ క్లారిటీ ఆరోజున వస్తుంది అని చెప్పొచ్చు. అలాగే సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ 7న రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదలు కానున్నట్లు తెలిపారు. ఇక ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే హారిక హాసిని ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణం వహించారు. అలాగే ఈ అక్టోబర్ 9న విడుదల చేస్తున్నారు.
Ma release punctuality meeda meeku doubt undachu, kani eesari alanti doubts em oddu 😄 #AdarshaKutumbam #AK47OnOCT9th
We are coming on 9th October. There is no change in that ❤️
6th – Trailer Launch
7th – Advance Bookings Open across both Telugu statesFamilies andaru mee…
— Naga Vamsi (@vamsi84) October 1, 2026


