రాజు గారి గది 2 లో అదిరిపోయే ట్విస్ట్ తో సమంత పాత్ర!
Published on Oct 4, 2017 6:11 pm IST

నాగార్జున లీడ్ రోల్ లో ఓంకార్ దర్శకత్వం లో పీవీపీ బ్యానర్ లో వస్తున్న చిత్రం రాజుగారి గది 2. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మొత్తం జరుపుకొని రిలీజ్ కి రెడీ అయ్యింది. ఈ సినిమాలో సమంత కూడా మరో కీలక పాత్రలో చేస్తుంది. అయితే ఈ సినిమాలో సమంత ఎలాంటి పాత్ర చేస్తుంది అనే ఆసక్తి ఉండేది.

అయితే తాజా గా వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో సమంత పాత్ర దెయ్యం అని తెలుస్తుంది. ఈమె సినిమాలో మధ్య మధ్యలో కనిపిస్తూ భయపెడుతుందని. అయితే సినిమా చివరి 20 నిమషాలు ఆమె పాత్ర చాలా కీలకంగా ఉంటుందని సమాచారం. ఆమె పాత్రని డైరెక్టర్ ఓంకార్ అద్బుతంగా డిజైన్ చేసినట్లు తెలుస్తుంది.

 
Like us on Facebook