ఓటిటి సెన్సేషన్ “స్క్విడ్ గేమ్ 2” పై ఇంట్రెస్టింగ్ అప్డేట్.!

ఓటిటి సెన్సేషన్ “స్క్విడ్ గేమ్ 2” పై ఇంట్రెస్టింగ్ అప్డేట్.!

Published on Apr 29, 2023 11:00 AM IST

గత కరోనా సమయంలో ఓటిటి కంటెంట్ డిమాండ్ భారీగా పెరిగిన సంగతి తెలిసిందే. అదే సమయంలో అనేక వెబ్ సిరీస్ లు ఆయా ప్లాట్ ఫామ్స్ లో అదరగొట్టాయి. మరి అదే విధంగా అయితే దిగ్గజ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కి వచ్చిన కొరియన్ సెన్సేషనల్ సిరీస్ “స్క్విడ్ గేమ్” కోసం అయితే ఇండియన్ ఆడియెన్స్ కి కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

నెట్ ఫ్లిక్స్ లో రికార్డు వ్యూవర్ షిప్స్ ని నమోదు చేసిన సీజన్ 1 కి సీక్వెల్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ సీక్వెల్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్ తెలుస్తుంది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం ఈ సీజన్ తాలూకా షూట్ ఈ ఏడాది వేసవిలో అయితే మొదలయ్యి దాదాపు 300 రోజులు పాటుగా షూటింగ్ జరుపుకోనుందట. అంటే ఇక వచ్చే ఏడాది లోనే సీజన్ 2 రిలీజ్ ఉంటుందని చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు