వాల్తేరు వీరయ్య ఇంటర్వెల్ పై ఇంట్రెస్టింగ్ అప్ డేట్ !

వాల్తేరు వీరయ్య ఇంటర్వెల్ పై ఇంట్రెస్టింగ్ అప్ డేట్ !

Published on Aug 15, 2022 8:00 PM IST

మెగాస్టార్ చిరంజీవి హీరోగా వాల్తేరు వీరయ్య అనే పవర్ ఫుల్ మాస్ ఎంటర్టైనర్ రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవితో పాటు రవితేజ కూడా ఓ ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నాడు. సినిమాలో ఇద్దరు బ్రదర్స్ గా నటించబోతున్నారు. అయితే రవితేజ, ఈ చిత్రంలో మెగాస్టార్ కి సవతి తల్లి కొడుకు అట. ఇప్పుడు ఈ సినిమా ఇంటర్వెల్ పై ఓ క్రేజీ అప్ డేట్ వినిపిస్తోంది.

ఈ సినిమా ఇంటర్వెల్ లో మెగాస్టార్ పై రవితేజ అటాక్ చేస్తాడని.. రెండు క్యారెక్టర్ల మధ్య మొదటి యాక్షన్ ఎపిసోడ్ వాల్తేరు వీరయ్య ఇంటర్వెల్ సీక్వెన్స్ లో వస్తోందని తెలుస్తోంది. ఆ తర్వాత వాల్తేరు వీరయ్యతో రవితేజ పాత్రకు మధ్య మంచి అనుబంధం ఏర్పడుతుందని తెలుస్తోంది. పైగా ఈ ఇంటర్వెల్ లో వచ్చే యాక్షన్ సీక్వెన్స్ లోనే రవితేజ పాత్ర ఈ సినిమాలో రివీల్ అవుతుందట.

ఇక ఈ చిత్రంలో రవితేజ పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉండబోతుందని తెలుస్తోంది. అన్నట్టు ఈ చిత్రంలో చిరు సరసన హీరోయిన్ గా శృతి హాసన్ నటించబోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు