ఆ క్యూట్ హీరోయిన్ లేడీ ఓరియెంటెడ్ మూవీ చేస్తుందట!

Published on Apr 3, 2020 11:40 am IST

టాలీవుడ్ లో యంగ్ హీరోలతో వరుసగా సినిమాలు చేసిన అనుపమ పరమేశ్వరన్ కి తెలుగులో అవకాశాలు తగ్గాయి. గత ఏడాది బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ రాక్షసుడు లో హీరోయిన్ గా నటించింది. ఆ సినిమా హిట్ అయినా అనుపమకు అంతగా అవకాశాలు రాలేదు. దీనితో ఆమె తమిళ, మలయాళ సినిమాలలో నటిస్తుంది. ఐతే ఆమెకు తెలుగులో ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీ చేసే అవకాశం దక్కిందని వార్తలు వినిపిస్తున్నాయి.

యంగ్ డైరెక్టర్ హనుమాన్ చౌదరి తెరకెక్కించనున్న ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీ కోసం ఆమె సైన్ చేశారని వార్తలు వస్తున్నాయి. హనుమాన్ చౌదరి గతంలో ఎవరు సినిమా కోసం పని చేయడం జరిగింది. ఈయన అనుపమ కోసం ఓ పవర్ ఫుల్ లేడీ ఓరియెంటెడ్ స్క్రిప్ట్ సిద్ధం చేశారని తెలుస్తుంది. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం కలదు. ఇక ప్రస్తుతం అనుపమ నిన్ను కోరి మలయాళ రిమేక్ లో నటిస్తుంది.

సంబంధిత సమాచారం :

X
More