‘రామాయణ’ ట్రైలర్ డేట్ లాక్? 100 రోజుల ముందే ప్లానింగ్!?

‘రామాయణ’ ట్రైలర్ డేట్ లాక్? 100 రోజుల ముందే ప్లానింగ్!?

Published on Jun 30, 2026 1:56 PM IST

Ramayana

ప్రస్తుతం ఇండియన్ సినిమా నుంచి రాబోతున్న గ్లోబల్ లెవెల్ సినిమాల్లో దర్శకుడు నితీష్ తివారి, రణబీర్ కపూర్ అలాగే యష్ ఇంకా సాయి పల్లవి లాంటి అగ్ర తారాగణంగా వస్తున్న సినిమా రామాయణ కూడా ఒకటి. భారతీయ సినిమా నుంచి మొదట ఐమాక్స్ సినిమాగా దీనిని ప్రెజెంట్ చేస్తూ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మాణం వహిస్తున్నారు.

అయితే విజువల్స్ పరంగా కొన్ని విమర్శలు ఉన్నప్పటికీ కంటెంట్ మాత్రం పెద్దగా వదలకుండానే నెట్టుకు వస్తున్నారు. ఇక ఇదిలా ఉండగా గత కొన్నాళ్ల కితమే సినిమా ట్రైలర్ కి సంబంధించి అప్డేట్ ఒకటి అందించాము. ట్రైలర్ ఈ జూలై లోనే ఉంటుంది అని టాక్ వచ్చింది. అయితే లేటెస్ట్ బజ్ ప్రకారం ఈ 100 రోజులు ముందే జూలై 14న మేకర్స్ లాస్ ఏంజిల్స్ లో విడుదల చేస్తున్నట్టు స్ట్రాంగ్ రూమర్స్ వినిపిస్తున్నాయి.

సో సినిమా రిలీజ్ కి ఎంతో సమయం ఉన్నా ఇంత త్వరగా ట్రైలర్ విడుదల చేయనుండడం ఆడియెన్స్ లో ఆసక్తి రేకెత్తించింది. ఇక దీనిపై అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. ఈ సినిమాకి హన్స్ జిమ్మర్, రెహమాన్ లు సంగీతం అందిస్తున్నారు. అలాగే నవంబర్ లో పాన్ వరల్డ్ స్థాయిలో ఈ సినిమా విడుదల కాబోతోంది.

తాజా వార్తలు