కలెక్షన్స్ రిపోర్ట్ : బాక్సాఫీస్ వద్ద ‘ఇజం’ జోరు..!
Published on Oct 23, 2016 12:46 pm IST

ism
పూరీ జగన్నాథ్, కళ్యాణ్ రామ్‌ల క్రేజీ కాంబినేషన్‌లో ‘ఇజం’ పేరుతో తెరకెక్కిన సినిమా గత శుక్రవారం (అక్టోబర్ 21న) భారీ ఎత్తున ప్రేక్షకుల ముందుకు వచ్చేసిన విషయం తెలిసిందే. మొదట్నుంచీ ఈ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌పై భారీ ఎత్తున అంచనాలు ఉండడంతో మొదటిరోజు కళ్యాణ్ రామ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ వచ్చాయి. ఇక ఈ సోషల్ డ్రామాకు ప్రేక్షకుల వద్ద నుంచి కూడా మంచి రెస్పాన్సే రావడంతో రెండో రోజు కూడా కలెక్షన్స్ ఏమాత్రం తగ్గలేదు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో కలుపుకొని రెండు రోజుల్లో ఈ సినిమా 4.66 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇక ఆదివారం కూడా ఇదే స్థాయిలో కలెక్షన్స్ ఉంటాయని ట్రేడ్ అంచనా వేస్తోంది. దీంతో ఫస్ట్ వీకెండ్ ఇజం సినిమా కళ్యాణ్ రామ్ కెరీర్‌కే హయ్యస్ట్‌గా నిలవనుంది.

ప్రాంతాల వారీగా ఇజం కలెక్షన్స్ వివరాలు ఇలా ఉన్నాయి..

ఏరియా కలెక్షన్స్ (రూపాయల్లో)
నైజాం : 1.85 కోట్లు
సీడెడ్ : 80 లక్షలు
ఉత్తరాంధ్ర : 51 లక్షలు
కృష్ణా : 31 లక్షలు
గుంటూరు : 54 లక్షలు
తూర్పు గోదావరి : 39 లక్షలు
పశ్చిమ గోదావరి : 26 లక్షలు
మొత్తం : 4.66 కోట్లు

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook