ఆరు రోజుల్లో ఇస్మార్ట్ శంకర్ అంత కొట్టాడా…!

Published on Jul 24, 2019 11:25 am IST

“ఇస్మార్ట్ శంకర్” విజయం చిత్ర యూనిట్ ని ఆనందంలో ముంచివేసింది. ముఖ్యంగా ఈ చిత్ర నిర్మాత ఛార్మి, డైరెక్టర్ పూరి, హీరో రామ్ లు చాలా ఖుషీగా ఉన్నారు. కారణం ఈ ముగ్గురికి ఇది చాలా రోజుల తరువాత అందిన అరుదైన విజయం కావడమే.డైరెక్టర్ రామ్ ఊర మాస్ కంటెంట్, హీరో రామ్ ఎనర్జిటిక్ పెరఫార్మెన్సు తో పాటు మణిశర్మ అందించిన సంగీతం ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకొనేలా చేశాయి. రామ్ కెరీర్ లో కలెక్షన్స్ పరంగా అల్ టైం హిట్ మూవీగా “ఇస్మార్ట్ శంకర్” నిలిచిపోతుందనడంలో ఎటువంటి సందేహం లేదు.

కాగా నిర్మాత ఛార్మి కొద్దిసేపటి క్రితం ఈ మూవీ వసూళ్ల కు సంబంధించి ఓ పోస్టర్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. దాని ప్రకారం ఇస్మార్ట్ శంకర్ ఆరు రోజులలో ప్రపంచ వ్యాప్తంగా 56కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించిందని తెలుస్తుంది.ఇండియన్ మూవీస్ కి ఓవర్ సీస్ లో అతిపెద్ద మార్కెట్ అయిన యూఎస్ లో వసూళ్లు పర్వాలేదనిపించినా , తెలుగు రాష్ట్రాలలో మాత్రం “ఇస్మార్ట్ శంకర్” దుమ్ము రేపుతోంది. విజయ్ దేవరకొండ నటించిన “డియర్ కామ్రేడ్” విడుదల వరకు ఈ చిత్రానికి పోటీ లేకపోవడంతో ఈ రెండు రోజులలో “ఇస్మార్ట్ శంకర్” మెరుగైన వసూళ్లు సాధించే అవకాశం కలదు.

సంబంధిత సమాచారం :