ఆఫీషియల్..”భవదీయుడు భగత్ సింగ్” గా పవన్ కళ్యాణ్.!

Published on Sep 9, 2021 9:59 am IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు దర్శకుడు హరీష్ శంకర్ ల మోస్ట్ అవైటెడ్ కాంబో నుంచి తమ సరికొత్త ప్రాజెక్ట్ పై ఈరోజు ఓ అదిరే అనౌన్సమెంట్ ఇస్తున్నామని మేకర్స్ సడెన్ గా ఓ అప్డేట్ ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే.. మరి దీనితో పాటుగా సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ మరియు టైటిల్ ని రివీల్ చేస్తామని కన్ఫర్మ్ చేశారు. అయితే ఈ చిత్రం నుంచి ఆల్రెడీ వినిపించినట్టుగా “భవదీయుడు భగత్ సింగ్” అనే టైటిల్ నే ఫిక్స్ చేసారు.

అంతే కాకుండా మొన్న పవన్ బర్త్ డే కానుకగా ఇచ్చిన ప్రీ లుక్ పోస్టర్ కి కంటిన్యూస్ గా మొత్తం లుక్ ని రివీల్ చేశారు. హార్లే డేవిడ్ సం బైక్ పై క్లాస్ గా కూర్చిని ఓ చేతిలో మైక్ మరో చేతిలో టీ గ్లాస్ తో పవన్ మార్క్ లో ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ ఉంది. మరి ఈ పోస్టర్ ని రివీల్ చేసి దర్శకుడు హరీష్ శంకర్ ఈ చిత్రానికి మళ్ళీ అందరి బ్లెస్సింగ్స్ కోరుకుంటున్నానని తెలిపారు. ఇక ఈ సాలిడ్ ఎంటర్టైనర్ కి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :