అఖిల్ హడావుడి చేయాల్సిన సమయం ఆసన్నమైంది !
Published on Nov 1, 2017 6:40 pm IST

అక్కినేని అఖిల్ తన రెండవ సినిమాను ప్రముఖ దర్శకుడు విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ‘హలో’ పేరుతో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంపై అక్కినేని అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాతో అఖిల్ మంచి విజయాన్ని అందుకొని హీరోగా నిలదొక్కుకోవాలని అందరూ ఆశిస్తున్నారు. ఇటీవలే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లకు కూడా బాగుండటంతో అభిమానులంతా టీజర్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

పైగా సినిమాను డిసెంబర్ 22న రిలీజ్ చేస్తామని ప్రకటించడంతో విడుదలకు గట్టిగా రెండు నెలలు కూడా సమయం లేనందున ఇక సినిమా హడావుడి మొదలుకావాల్సిందేనని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. వాస్తవంగా చూస్తే డిసెంబర్ 22 వరకు సినిమాకు సంబందించిన ఏదో ఒక విశేషం ప్రేక్షకుల్లో నానుతూ ఉండాల్సిందే. అప్పుడే సినిమాకు తగినంత హైప్ క్రియేట్ అవుతుంది.

మరి ఈ విషయంపై అక్కినేని టీమ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. నాగార్జున దగ్గరుండి చాలా పకడ్బంధీగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో దర్శకుడు ప్రియదర్శన్ కుమార్తె కళ్యాణి హీరోయిన్ గా నటిస్తోంది.

 
Like us on Facebook