మేము సైతం : తుఫాన్ బాధితులకు అండగా ‘జబర్దస్త్’ టీం.
Published on Oct 25, 2014 5:18 pm IST

jabardasth
విశాఖలో ప్రకృతి సృష్టించిన మహా ప్రళయం చూసి యావత్ సినీ ప్రపంచం కదలివచ్చింది. హుధూద్ తుఫాన్ భాధితులకు ధనరూపంలో సహాయం చేయడంతో పాటు విశాఖ వెళ్లి సహాయక కార్యక్రమాలలో పాల్గొన్నారు. వీరికి తోడు మేము సైతం అంటూ ముందుకొచ్చారు ‘జబర్దస్త్’ టీం. ‘జబర్దస్త్’ కార్యక్రమం ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు టన్నుల కొద్ది వినోదాన్ని అందిస్తున్న వీరు, తమ వంతుగా సహాయం చేశారు.

ధనరాజ్, తాగుబోతు రమేష్, వివా హర్ష, వేణు, చమ్మక్ చంద్ర, రాఘవ, రఘు, చంటి మరియు ఇతర సభ్యులు కలసి 4.5 లక్షల రూపాయలను తుఫాన్ భాదితుల సహార్ధం ఎపి సియం రిలీఫ్ ఫండ్ కు డొనేట్ చేశారు. ఈ రోజు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిని కలసి చెక్ అందజేశారు. ఇతర కమిట్మెంట్స్ ఉండడం వలన నాగబాబు, రోజా రాలేకపోయారని ధనరాజ్ తెలిపారు.

 
Like us on Facebook