‘జైలర్ 2’లో ఏకంగా 12 పాటలు.. లిస్ట్ బయటపెట్టిన మేకర్స్..!

‘జైలర్ 2’లో ఏకంగా 12 పాటలు.. లిస్ట్ బయటపెట్టిన మేకర్స్..!

Published on Sep 29, 2026 6:58 PM IST

సూపర్‌స్టార్ రజినీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘జైలర్ 2’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ దగ్గర రజినీ తన మ్యాజిక్ చూపెట్టడం ఖాయమని అభిమానులు ఆశిస్తున్నారు. ఇక ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండటంతో ఈ చిత్ర మ్యూజిక్‌పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.

అయితే, తాజాగా ‘జెయిలర్ 2’ ఆడియో అప్‌డేట్‌ను మేకర్స్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ చిత్రానికి సంబంధించిన 12 పాటల గ్రాండ్ ట్రాక్‌లిస్ట్‌ను మేకర్స్ అధికారికంగా ప్రకటించగా, పూర్తి ఆల్బమ్ సెప్టెంబర్ 30 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ వెల్లడించారు.

అనిరుధ్ అందించిన 12 ట్రాక్‌ల పూర్తి ఆల్బమ్ కోసం అభిమానులు అత్యంత ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ఎస్‌జే సూర్య, విద్యారమ్య కృష్ణన్, యోగి బాబు తదితర భారీ తారాగణంతో రూపొందుతున్న ఈ చిత్రం, దసరా కానుకగా అక్టోబర్ 15, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు