యంగ్ హీరో సందీప్ కిషన్ నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ అడ్వెంచర్ చిత్రం ‘సిగ్మా’ ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 2న థియేటర్లలో విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది. తమిళ దర్శకుడు జాసన్ సంజయ్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతుండగా, ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మించారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ మరియు ఎన్విఆర్ సినిమా సంయుక్తంగా గ్రాండ్‌గా విడుదల చేస్తున్నాయి.
రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ఈ చిత్రం తాజాగా సెన్సార్ పనులు పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ సినిమాకి ‘యూ/ఏ’ సర్టిఫికేట్‌ను కేటాయించింది. అలాగే ఈ చిత్ర నిడివి 2 గంటల 27 నిమిషాలుగా లాక్ చేశారు. కథకు తగినట్లుగా రన్‌టైమ్ చాలా క్రిస్ప్‌గా ఉంటుందని చిత్ర యూనిట్ చెబుతోంది.
ఈ సినిమాలో సందీప్ కిషన్ సరసన ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటిస్తుండగా రాజు సుందరం, సంపత్ రాజ్, శివ్ పండిత్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు.



