‘టీజర్’తో రాబోతున్న జోడి !

Published on Jul 23, 2019 5:20 pm IST

ఆది సాయికుమార్ హీరోగా ‘జెర్సీ’ ఫేమ్ శ్రధ్ధా శ్రీనాథ్ హీరోయిన్ గా ‘జోడి’ అనే టైటిల్ తో ఓ మూవీ రాబోతున్న విషయం తెలిసిందే. కాగా తాజాగా ఈ చిత్రం టీజర్ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకుంది. టీజర్ రేపు ఉదయం 11 గంటల 16 నిముషాలకు విడుదల కానుందని చిత్రబృందం అధికారికంగా పోస్టర్ ను విడుదల చేసింది. ఉగాది పండగ సందర్భంగా విడుదల చేసిన జోడి ఫస్ట్ లుక్ పోస్టర్ కు మంచి స్పందన వచ్చింది. మరి టీజర్ కి ఎలాంటి స్పందన వస్తోందో చూడాలి.

ఇక గతంలో వాన, మస్కా, సినిమా చూపిస్త మామ చిత్రాలకు అసోసియేట్ డైరెక్టర్ గా పనిచేసిన విశ్వనాథ్ అరిగెల ఈ చిత్రంతో దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ను పూర్తి చేసుకున్న జోడీ త్వరలో విడుదలకు సన్నాహాలు చేసుకుంటుంది. ఈ చిత్రానికి సంగీతం : ‘నీవే’ ఫణికళ్యాణ్, సినిమాటోగ్రఫీ : ఎస్.వి. విశ్వేశ్వర్, ఎడిటర్ : రవి మండ్ల, మాటలు : త్యాగరాజు(త్యాగు), నిర్మాతలు : పద్మజ, సాయి వెంకటేష్ గుర్రం, దర్శకత్వం : విశ్వనాథ్ అరిగెల.

సంబంధిత సమాచారం :