వీరి విస్ఫోటనం అప్పుడు మొదలు కానుందా.?

Published on Aug 13, 2020 3:15 pm IST

తన కేజీయఫ్ సినిమాతో ఒక్క సారిగా పాన్ ఇండియన్ రేంజ్ క్రేజ్ తెచ్చుకున్నాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. దీనితో అక్కడ నుంచి అతను ఏ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినా అది హాట్ టాపికే అవుతుంది. మరి అలాంటి మాస్ దర్శకునికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ లాంటి మరో పవర్ ఫుల్ మాస్ హీరో తోడైతే ఆ ఇంపాక్ట్ వేరే లెవెల్లో ఉంటుంది.

అలా ఈ ఒద్దరి కాంబోలో ఓ సినిమా ఉండనుంది అని హింట్స్ వస్తున్న దగ్గర నుంచి ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అలాగే మళ్ళీ ఈ మధ్యనే స్టోరీకి సంబంధించిన సంప్రదింపులు కూడా జరిగిపోయాయి అన్నది తెలిసింది. ఇప్పటికే ఈ చిత్రానికి పలు పవర్ ఫుల్ టైటిల్స్ పరిగణలో ఉన్నాయని కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

అయితే తారక్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలు కానుందో టాక్ వినిపిస్తుంది. ఈ భారీ ప్రాజెక్ట్ వచ్చే 2021 చివర్లో కానీ 2022 ఆదిలో కానీ మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయట. మరి వీరి విస్ఫోటనం ఎప్పుడు మొదలు కానుందో కాలమే నిర్ణయించాలి.

సంబంధిత సమాచారం :

More