‘యమదొంగ’ ఎపిక్ ఎంట్రీని రీ-క్రియేట్ చేసిన ఎన్టీఆర్.. ఎంజాయ్ చేసిన రాజమౌళి..!

‘యమదొంగ’ ఎపిక్ ఎంట్రీని రీ-క్రియేట్ చేసిన ఎన్టీఆర్.. ఎంజాయ్ చేసిన రాజమౌళి..!

Published on Sep 29, 2026 8:22 PM IST

Jr-NTR (1)

మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ మళ్ళీ తన ఐకానిక్ ‘యమదొంగ’ మేనరిజమ్‌తో దుమ్మురేపాడు. ఫహద్ ఫాజిల్ నటిస్తున్న ‘డోంట్ ట్రబుల్ ద ట్రబుల్’ చిత్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు చీఫ్ గెస్టులుగా ఎన్టీఆర్, రాజమౌళి హాజరయ్యారు.

ఈ క్రమంలో ఎన్టీఆర్‌ను వేదికపైకి యాంకర్ సుమ పిలవగా, చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఎన్టీఆర్ తన ‘యమదొంగ’ ఎపిక్ ఎంట్రీతో వచ్చారు. ఈ ఎంట్రీని దర్శకుడు రాజమౌళి, అక్కడున్న చిత్ర టీమ్, ప్రేక్షకులు ఫుల్‌గా ఎంజాయ్ చేశారు.

‘యమదొంగ’ సినిమాలో రాజమౌళి డిజైన్ చేసిన ఆ ఎంట్రీ సీన్ తెలుగు సినిమా హిస్టరీలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ మాస్ మూమెంట్స్. మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత అదే ఎనర్జీని, అదే రాయల్ స్వాగ్‌ని ఎన్టీఆర్ లైవ్‌లో రీ-క్రియేట్ చేయడంతో సోషల్ మీడియాలో ఈ ఎంట్రీకి సంబంధించిన వీడియో ట్రెండింగ్‌లోకి వచ్చేసింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు