‘డ్రాగన్’ చెప్పిన టైమ్‌కే వస్తాడు.. రిలీజ్ డేట్‌పై నిర్మాత క్లారిటీ..!

‘డ్రాగన్’ చెప్పిన టైమ్‌కే వస్తాడు.. రిలీజ్ డేట్‌పై నిర్మాత క్లారిటీ..!

Published on Sep 29, 2026 9:12 PM IST

Dragon

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటిస్తున్న ది మోస్ట్ అవైటెడ్ చిత్రం ‘డ్రాగన్’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర విధ్వంసం క్రియేట్ చేసేందుకు ఎన్టీఆర్ మరోసారి రెడీ అవుతున్నాడు. అయితే, ఈ సినిమా రిలీజ్ విషయంలో గతకొద్ది రోజులుగా సోషల్ మీడియాలో పలు రూమర్స్ వినిపిస్తున్నాయి.

డ్రాగన్ చిత్రాన్ని జూన్ 11, 2027న రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రేకటించారు. కానీ, ఈ సినిమా వాయిదా పడుతుందనే వార్తలు జోరుగా చక్కర్లు కొట్టాయి. కాగా, ఈ వార్తలకు నిర్మాత మైత్రీ రవిశంకర్ తాజాగా చెక్ పెట్టారు. ‘డోంట్ ట్రబుల్ ద ట్రబుల్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో మాట్లాడిన రవిశంకర్, డ్రాగన్ ఖచ్చితంగా జూన్ 11నే వస్తుందని ఆయన కన్ఫర్మ్ చేశారు.

దీంతో డ్రాగన్ రిలీజ్ డేట్ పై వచ్చిన రూమర్స్‌కు చెక్ పడింది. ఇక ఈ సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తుండగా మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు