కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ తో వర్క్ చేయనున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ?

కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ తో వర్క్ చేయనున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ?

Published on Feb 5, 2023 9:36 PM IST

టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇటీవల దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన భారీ ఈమూవీ ఆర్ఆర్ఆర్ భారీ సక్సెస్ తో గ్లోబల్ గా నటుడిగా ఎంతో గొప్ప పేరు సంపాదించారు. దాని అనంతరం అతి త్వరలో కొరటాల శివ దర్శకత్వంలో తన కెరీర్ 30వ సినిమా చేయనున్నారు ఎన్టీఆర్. భారీ స్థాయిలో పాన్ ఇండియా రేంజ్ లో రూపొందనున్న ఈ మూవీ అతి త్వరలో పట్టాలెక్కనుంది. అయితే ఎన్టీఆర్ కి సంబంధించి ప్రస్తుతం ఒక ఇంట్రస్టింగ్ న్యూస్ టాలీవుడ్ లో బజ్ గా మారింది.

ఇటీవల ధనుష్ తో అసురన్ వంటి భారీ యక్షన్ మూవీ తెరకెక్కించి సూపర్ డూపర్ హిట్ కొట్టిన వెట్రి మారన్, ప్రస్తుతం విజయ్ సేతుపతి, గౌతమ్ మీనన్ లతో విడుతలై అనే సినిమాతో పాటు సూర్య తో వాడివాసల్ మూవీ కూడా తెరకెక్కిస్తున్నారు. కాగా వాటి అనంతరం టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ఆయన ఒక మూవీ చేయాన్నారని అంటున్నారు. మరొక ఇంట్రస్టింగ్ విషయం ఏమిటంటే, ఎన్టీఆర్ వెట్రి మారన్ ల మూవీ రెండు భాగాలుగా తెరకెక్కనుండగా మొదటి భాగంలో ఎన్టీఆర్, అలానే రెండవ భాగంలో ధనుష్ హీరోలుగా నటిస్తారట. ప్రస్తుతం ఆ మూవీకి సంబంధించి కథా చర్చలు జరుగుతున్నాయని, అలానే త్వరలోనే ఈ మూవీ పై అఫీషియల్ గా అనౌన్స్ మెంట్ కూడా రానుందని తెలుస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు