బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాలో నటించబోతున్న కాజల్ ?
Published on Feb 25, 2018 4:06 pm IST

వంశధార క్రియేషన్స్ ప్రొడక్షన్ నెం.1. పతాకంపై బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా శ్రీనివాస్ అనే నూతన దర్శకుడి సినిమా తాజాగా ప్రారంభం అయ్యింది. ఈ చిత్రాన్ని వంశధార క్రియేషన్స్ పతాకంపై నవీన్ సొంటినేని (నాని) నిర్మించనున్నారు. తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. తాజా సమాచారం మేరకు ఈ సినిమాలో కాజల్ హీరోయిన్ గా నటిస్తోందని తెలుస్తోంది.

ఇద్దరు హీరోయిన్స్ నటించబోయే ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ ఎవరనేది త్వరలో తెలియబోతోంది. చోటా కె నాయుడు ఈ సినిమాకు కెమెరామెన్ గా పనిచెయ్యబోతున్నాడు. శ్రీనివాస్ గతంలో దృశ్యం, గోపాలా గోపాలా , డిక్టేటర్ సినిమాలకు దర్శకత్వశాఖలో పనిచెయ్యడం జరిగింది.చోటా కె ప్రసాద్ ఎడిటర్ గా పనిచేస్తున్న ఈ సినిమాకు చాగంటి శాంతయ్య సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

 
Like us on Facebook