యంగ్ హీరో సరసన కాజల్ !

స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ వరుస సినిమాలకు సైన్ చేస్తూ బిజీ బిజీ అయిపోతున్నారు. ఇప్పటికే నాని నిర్మించిన ‘అ !’ సినిమాలో నటించిన ఈమె ప్రస్తుతం కళ్యాణ్ రామ్ ‘ఎం.ఎల్.ఏ’ సినిమాలోను, ‘క్వీన్’ తమిల్ రీమేక్ ‘పారిస్ పారిస్’ లోను నటిస్తూనే యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ చేయనున్న కొత్త సినిమాకి కూడా సైన్ చేశారట.

ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు నాని డైరెక్ట్ చేయనున్నారు. కథ, దర్శకుడు తన పాత్రను మలచిన తీరు నచ్చి కాజల్ ఈ చిత్రానికి సైన్ చేశారట. ప్రస్తుతం స్క్రిప్ట్ దశలో ఉన్న ఈ సినిమాలో మార్చి నెలలో మొదలయ్యే అవకాశాలున్నాయి. ఈ చిత్రం కూడా శ్రీనికివాస్ యొక్క గత చిత్రాల్లానే యాక్షన్ ఎంటర్టైనర్ గా ఉండనుందని సమాచారం.