ఆ వార్తలో నిజం లేదు అంటున్న డైరెక్టర్ !
Published on Oct 23, 2017 1:22 pm IST


నాగార్జున కథానాయకుడిగా కళ్యాణ్ కృష్ణ గతంలో ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమాను తెరకెక్కించాడు. నాగార్జున కెరియర్లోనే ఈ సినిమా భారీ విజయంగా నిలిచింది. ఈ సినిమాలో నాగార్జున పోషించిన ‘బంగార్రాజు’ పాత్ర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. చాలా సరదాగా సాగే ఈ పాత్ర ఎప్పటికి గుర్తుండిపోయే విధంగా ఉంటుంది. ఇదిలా ఉండగా గతంలో కళ్యాణ్ కృష్ణ బంగార్రాజు అనే టైటిల్ ను రిజిస్టర్ చేయించుకున్నాడు. నాగార్జునతో ‘సోగ్గాడే చిన్నినాయన’ సీక్వెల్ తీసే ఆలోచనతో ఈ టైటిల్ ను రిజిస్టర్ చేసుకోవడం జరిగింది.

తాజాగా వస్తున్న కథనాలు ఏంటంటే.. బంగార్రాజు టైటిల్ తో కళ్యాణ్ కృష్ణ, రవితేజ తో సినిమా చెయ్యబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలో నిజం లేదని కళ్యాణ్ కృష్ణ తెలిపారు. సోషల్ మీడియాలో ఇలా అసత్య ప్రచారాలు జరగడం సహజం, త్వరలో డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ తీయబోయే సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడనుంది.

 
Like us on Facebook