సెన్సార్ కంప్లీట్ చేసుకున్న కళ్యాణ్ రామ్ “అమిగోస్”.!

Published on Feb 6, 2023 9:00 am IST

నందమూరి వారి టాలెంటెడ్ హీరో కళ్యాణ్ రామ్ హీరోగా ఆషిక రంగనాథ్ హీరోయిన్ గా దర్శకుడు రాజేంద్ర రెడ్డి తెరకెక్కించిన ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ చిత్రం “అమిగోస్”. ఈ వారం థియేటర్స్ లో రిలీజ్ కి రానున్న ఈ చిత్రంపై సాలిడ్ బజ్ నెలకొంది. మరి నిన్ననే చిత్ర యూనిట్ గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాసివ్ ప్రెజెన్స్ తో ముగిసింది.

అయితే ఈ చిత్రం ఇప్పుడు సెన్సార్ కూడా కంప్లీట్ చేసుకున్నట్టు తెలుస్తుంది. మరి ఈ చిత్రానికి అయితే సెన్సార్ యూనిట్ యూ/ఏ సర్టిఫికెట్ ని ఇచ్చినట్టుగా తెలుస్తుంది. దీనితో ఈ సినిమా అన్ని పనులు కంప్లీట్ చేసేసుకుందని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి అయితే జిబ్రాన్ సంగీతం అందించగా కళ్యాణ్ రామ్ ఈ సినిమా మూడు ట్రిపుల్ రోల్స్ ని చేసాడు అలాగే మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహించిన ఈ చిత్రం ఫిబ్రవరి 10న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :