తండ్రి డైరక్షన్.. కూతురు యాక్షన్ !

Published on Dec 10, 2018 8:46 am IST

ప్రముఖ మలయాళీ దర్శకుడు ప్రియదర్శన్ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘కుంజలి మారాక్కర్’. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో అర్జున్ , కీర్తి సురేష్ , కళ్యాణి ప్రియదర్శన్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇక మొదటి సారి తన తండ్రి దర్శకత్వంలో నటిస్తుంది కళ్యాణి. తాజాగా ఆమె షూటింగ్ లో జాయిన్ అయ్యింది. భారీ బడ్జెట్ తో నిర్మితమవుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది చివర్లో విడుదలకానుంది.

ఇక కళ్యాణి ప్రస్తుతం ఈ చిత్రం తోపాటు దుల్కర్ సల్మాన్ తో ఒక చిత్రంలో అలాగే తెలుగులో సాయి ధరమ్ తేజ్ సరసన ‘చిత్రలహరి’ లో నటిస్తుంది.

సంబంధిత సమాచారం :