‘కాంచన 3’ విడుదల తేదీ ఖరారు !

Published on Jan 9, 2019 3:10 pm IST

హార్రర్ థ్రిల్లర్ నేపథ్యంలో ముని సిరీస్ లో ఇప్పటివరకు వచ్చిన మూడు చిత్రాలు మంచి విజయం సాధించాయి. ఇక తాజాగా ఈసిరీస్ లోనుండి నాల్గవ సినిమా రానుంది. ‘కాంచన 3’ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో స్వీయ దర్శకత్వంలో నటిస్తున్నాడు రాఘవ లారెన్స్. రాఘవేంద్ర ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. తాజాగా ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదలచేశారు.

నిక్కీ తంబోలి , ఓవియా ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో వుంది. ఇక ఈ సీరిస్ లో వచ్చిన చిత్రాలు తెలుగులోనూ విడుదలై విజయం సాధించాయి. ప్రముఖ నిర్మాత ఠాగూర్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం తమిళ , తెలుగు భాషల్లో ఏప్రిల్ 18న విడుదలకానుంది.

సంబంధిత సమాచారం :

X
More