యుఎస్ఏ లో అదరగొడుతున్న ‘కాంతార’ తెలుగు వర్షన్ మూవీ

యుఎస్ఏ లో అదరగొడుతున్న ‘కాంతార’ తెలుగు వర్షన్ మూవీ

Published on Oct 22, 2022 9:09 PM IST

కాంతార, ఇప్పుడు మన దేశంతో పాటు అనేక ప్రాంతాల్లో ఎక్కడ విన్నా, ఎవరి నోట విన్నా ఈ మూవీ గురించే పెద్ద చర్చ. ఆద్యంతం ఆకట్టుకునే కథ, కథనాలతో యాక్షన్, ఎమోషనల్ అంశాలతో తెరకెక్కిన ఈ మూవీలో హీరోగా నటిస్తూ స్వయంగా మూవీని తెరకెక్కించారు రిషబ్ శెట్టి. సప్తమి గౌడ హీరోయిన్ గా నటించిన ఈ మూవీని హోంబలె ఫిలిమ్స్ బ్యానర్ పై విజయ్ కిరగందూర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించగా అజనీష్ లోక నాథ్ మ్యూజిక్ అందించారు.

ఇక అన్ని వర్గాల ఆడియన్ ని ఆకట్టుకుంటూ ఇటు తెలుగులో సైతం కాంతర ప్రస్తుతం భారీ కలెక్షన్స్ తో దూసుకెళుతోంది. తెలుగులో అక్టోబర్ 15న ఈ మూవీని గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ రిలీజ్ చేసారు. అయితే విషయం ఏమిటంటే, నిన్న నాలుగు సినిమాలు రిలీజ్ అయినప్పటికీ కూడా కాంతార ఇంకా తన హవా ని కొనసాగిస్తూనే ఉంది. ఇక కాంతార తెలుగు వర్షన్ ఇప్పటివరకు యుఎస్ఏ లో 154 కె డాలర్లు కలెక్షన్ అందుకుని అక్కడ ఇంకా దిగ్విజయంగా కొనసాగుతోంది. అలానే రాబోయే రోజుల్లో కాంతార అక్కడ రికార్డు కలెక్షన్ అందుకునే అవకాశం ఉందంటున్నారు ట్రేడ్ అనలిస్టులు. మొత్తంగా కన్నడ సహా అన్ని భాషల్లో కాంతార బ్లాక్ బస్టర్ సక్సెస్ తో కొనసాగుతుండడంతో యూనిట్ ఆనందం వ్యక్తం చేస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు