“కాంతారా” వరల్డ్ ప్రీమియర్ టెలికాస్ట్ డేట్ ఖరారు.!

“కాంతారా” వరల్డ్ ప్రీమియర్ టెలికాస్ట్ డేట్ ఖరారు.!

Published on Jan 15, 2023 1:00 PM IST

కన్నడ స్టార్ నటుడు రిషబ్ శెట్టి హీరోగా సప్తమి గౌడ హీరోయిన్ గా అలాగే రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలోనే తెరకెక్కించిన లేటెస్ట్ భారీ హిట్ చిత్రం “కాంతారా”. ఓ డివోషనల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ చిత్రం కన్నడలో ఇండస్ట్రీ హిట్ కాగా తెలుగు సహా హిందీ భాషల్లో కూడా సాలిడ్ వసూళ్లతో మాసివ్ హిట్ అయ్యింది. దీనితో అన్ని భాషల ఆడియెన్స్ ఆదరణ అందుకున్న ఈ చిత్రం రీసెంట్ గానే తెలుగులో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కి సిద్ధం అయ్యింది.

మరి ఈ సినిమా టెలికాస్ట్ హక్కులు స్టార్ మా వారు కొనుగోలు చేయగా అందులో ఈ చిత్రం అయితే ఇప్పుడు డేట్ ని ఫిక్స్ చేసుకుంది. మరి స్టార్ మా వారు అయితే ఈ జనవరి 22 ఆదివారం సాయంత్రం ఈ అవైటెడ్ చిత్రాన్ని టెలికాస్ట్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. మరి థియేటర్స్ లో తెలుగు ఆడియెన్స్ ఆదరణ అందుకున్న ఈ చిత్రం స్మాల్ స్క్రీన్ పై కూడా అంతే స్థాయి రెస్పాన్స్ అందుకుంటుందేమో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు