‘పందెంకోడి 2’ చిత్రానికి స్టార్ హీరో వాయిస్ ఓవర్ !

Published on Oct 14, 2018 4:00 am IST

యాక్షన్ హీరో విశాల్, కీర్తి సురేష్ జంటగా నటించిన తాజా చిత్రం ‘సండకోళి 2’ విడుదలకు సిద్దమవుతుంది. లింగు సామి తెరకెక్కించిన ఈచిత్రం 2005లో సూపర్ హిట్ సాధించిన ‘సండకోళి’ చిత్రానికి సీక్వెల్ గా రానుంది. ఇక ఈచిత్రానికి స్టార్ హీరో కార్తీ వాయిస్ ఓవర్ ఇచ్చారు. విశాల్ , కార్తీ ఎప్పటినుండో మంచి స్నేహితులు. దాని కారణంగానే ఆయనఈచిత్రానికి వాయిస్ ఇచ్చాడని సమాచారం.

ఇక ఈచిత్రాన్ని ప్రముఖ నిర్మాత ఠాగూర్ మధు తెలుగులో ‘పందెంకోడి 2’ పేరుతో విడుదలచేయనున్నారు. పక్క కమర్షియల్ ఎంటర్టైనెర్ గా రానున్న ఈచిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తుండగా వరలక్ష్మి శరత్ కుమార్ ముఖ్య పాత్రలో నటించింది. ఈచిత్రం దసరా కానుకగా అక్టోబర్ 18న తమిళ, తెలుగు భాషల్లో కలిపి సుమారు 2000 ల స్క్రీన్ లలో విడుదలకానుంది.

సంబంధిత సమాచారం :