‘కాష్మోరా’ను ‘బాహుబలి’తో పోల్చకండి!
Published on Oct 25, 2016 3:00 pm IST

karthi
దర్శక ధీరుడు రాజమౌళి సృష్టించిన ప్రభంజనం ‘బాహుబలి’ ఇండియన్ సినిమాలో ఒక బెంచ్ మార్క్ సెట్ చేసిన విషయం తెలిసిందే. విజువల్ ఎఫెక్ట్స్ పరంగా, భారీ సెట్టింగ్స్ పరంగా, యుద్ధ సన్నివేశాలను అద్భుతంగా చిత్రీకరించడం పరంగా ఇలా ఎలా చూసినా బాహుబలి స్థాయి వేరు. తాజాగా తమిళ స్టార్ హీరో కార్తీ నటించిన కాష్మోరా అనే సినిమాలో కూడా కొద్దిభాగం యుద్ధ నేపథ్యంలో, ఓ సైనికాధికారి చుట్టూ కథ నడుస్తుంది. దీంతో తమిళనాట సాధారణంగానే ‘బాహుబలి’ సినిమాతో ‘కాష్మోరా’ను పోల్చి చూడడం కనిపిస్తోంది.

దీపావళి కానుకగా అక్టోబర్ 28న పెద్ద ఎత్తున కాష్మోరా విడుదలవుతోన్న నేపథ్యంలో హీరో కార్తీ ప్రమోషన్స్‌ను వేగవంతం చేశారు. ఈ ప్రమోషన్స్‌లో భాగంగానే ఆయన మాట్లాడుతూ.. ‘కాష్మారో’ను ‘బాహుబలి’తో పోల్చవద్దని, బాహుబలి సినిమా ఒక వండర్ అని, ఈ సినిమాకు, ఆ సినిమాకూ కథ పరంగా చిన్న పోలిక మాత్రమే ఉందని, రెండూ వేటికవే భిన్నమైనవని అన్నారు. కార్తీ సరసన నయనతార, శ్రీదివ్య హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా తెలుగులోనూ అక్టోబర్ 28నే పెద్ద ఎత్తున విడుదలవుతోంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాకు గోకుల్ దర్శకత్వం వహించారు.

 
Like us on Facebook