మరోసారి హాట్ టాపిక్ గా మారిన కీరవాణి ట్వీట్ !
Published on May 18, 2017 5:51 pm IST


గతంలో టాలీవుడ్లోని ప్రస్తుత దర్శకుల గురించి ట్వీట్లు చేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసిన ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి మరోసారి తన ట్వీట్లతో అందరిలోను ఆసక్తి రేపారు. ఈరోజు ఉదయం ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో బాహుబలి-2 చిత్రం అన్ని పరిశ్రమలకి పెద్ద చిత్రం అంటూ ట్వీట్ చేయగా కీర్వాన్ని దాన్ని రీ ట్వీట్ చేస్తూ ఒకవేళ ఇది నిజమైతే ఒక హిందీ గాయకుడు/గాయని బాహుబలి-2 మలయాళం వెర్షన్ లో పాడమంటే అవమానంగా ఫీలై పాడటానికి నిరాకరించారు అన్నారు.

దీంతో చాలా మంది సోషల్ మీడియా ఫాలోవర్లు సినిమా బాహుబలి-1 సాధించిన విజయం చూసి కూడా బాహుబలి-2 లో పాడే అవకాశాన్ని వదులుకున్న అవమానంగా భావించి వదులుకున్న ఆ గాయకుడు/గాయని ఎవరనేది తెలుసుకోవాలని ఉబలాటపడుతున్నారు. కానీ కీరవాణి మాత్రం ఆ గాయకుడు/గాయని ఎవరనేది బయటపెట్టలేదు. ఇకపొతే కీరవాణి ప్రస్తావించిన మలయాళ వెర్షన్లో ఆయనతో పాటు యాజిన్ నిజార్, విజయ్ ఏసుదాస్, శ్వేతా మోహన్, మధు బాలకృష్ణన్ లు పాడారు.

 
Like us on Facebook