“కేజీఎఫ్-2” మూవీపై లేటెస్ట్ అప్డేట్..!

Published on Feb 13, 2022 3:00 am IST

కన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా, శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన “కేజీఎఫ్ చాప్టర్-1” సంచలనాలు సృస్టించిన సంగతి తెలిసిందే. దీనికి సీక్వెల్‌గా వస్తున్న “కేజీఎఫ్ చాప్టర్-2″పై కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కరోనా కారణంగా విడుదల ఆలస్యమైన ఈ చిత్రం ఏప్రిల్ 14వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఇటీవల విడుదలైన ఈ చిత్ర టీజర్ సరికొత్త రికార్డులను సృష్టించింది.

అయితే టీజర్ తర్వాత ఈ సినిమాకి సంబంధించిన ఒక అప్డేట్ కూడా రాకపోవడంతో ఫ్యాన్స్ కాస్త నిరాశగా ఉన్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా నుంచి ఒక సర్ప్రైజ్ ఇవ్వాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 25న ఈ సినిమా మొదటి పాటను విడుదల చేయాలని దర్శక నిర్మాతలు నిర్ణయించుకున్నారట. అయితే దీనిపై ఇప్పటివరకు మేకర్స్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు. త్వరలోనే దీనిపై ఏమైనా ప్రకటన వస్తుందేమో చూడాలి మరీ.

సంబంధిత సమాచారం :