ఈ నెలాఖరున ఉక్రెయిన్ వెళ్లనున్న మెగాస్టార్ !
Published on Oct 18, 2016 6:03 pm IST

chiranjeevi
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 150వ చిత్రం ‘ఖైదీ నెం 150’ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ప్రస్తుతం ఈ చిత్రంలోని ఓ ఐటం సాంగ్ ను అన్నపూర్ణ స్టూడియోస్ లో వేసిన ప్రత్యేకమైన సెట్ లో చిత్రీకరిస్తున్నారు. ఎప్పటిలాగే చిరు ఈ సినిమాలో కూడా డ్యాన్సుల మీద ఎక్కువ సర్ద పెట్టినట్టు తెలుస్తోంది. ముఖ్యానంగా ఐటమ్ సాంగ్ కు చిరు ఫెవరెట్ కంపోజర్ రాఘవా లారెన్స్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఇకపోతే దర్శకుడు వినాయక్ కూడా ఈ చిత్రం మేకింగ్ విషయంలో ఎక్కడా తగ్గకుండా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

అందుకే చిరు, హీరోయిన్ కాజల్ పై పాటల చిత్రీకరణను ‘ఉక్రెయిన్’ జరపనున్నారు. ఈ నెలాఖరున యూనిట్ ఉక్రెయిన్ వేలే అవకాశముందని తెలుస్తోంది. ఇక్కడే 2 పాటలు చిత్రీకరిస్తారు. ఈ రెండూ కూడా రొమాంటిక్ గా సాగే పాటలేనట. ఇక దాదాపు షూటింగ్ ను పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి సందర్బంగా విడుదల చేయనున్నారు. రామ్ చరణ్ తేజ్ కొణిదల ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని స్వయంగా నిర్మిస్తున్నారు.

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook