10 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసిన మాస్ మహారాజ్ “ఖిలాడి” టీజర్..!

Published on Oct 1, 2021 10:49 pm IST


మాస్ మహారాజ రవి తేజ హీరోగా, మీనాక్షి చౌదరీ, డింపుల్ హాయాతీ హీరోయిన్లుగా రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఖిలాడి’. ఎ స్టూడియోస్ పతాకంపై సత్యనారాయణ కోనేరు మరియు రమేష్ వర్మలు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా విడుదలకు సిద్దమవుతుంది. అయితే ఈ సినిమా టీజర్‌ను ఈ ఏడాది ఉగాది సందర్భంగా రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.

అయితే యూట్యూబ్‌లో ఈ టీజర్ 10 మిలియన్ వ్యూస్‌ని క్రాస్ చేసి, ఇంకా అదే హవాతో దూసుకుపోతుంది. ఇదిలా ఉండగా ఈ సినిమాకి సంబంధించిన పాటలకు కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో ప్రతినాయకుడిగా యాక్షన్ కింగ్ అర్జున్ నటిస్తుండగా, సచిన్ కేడ్కర్, ఉన్ని ముకుందన్, ముఖేశ్ రుషి, రావు రమేశ్, అనసూయ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :