చరణ్ పై కియారా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వైరల్.!

Published on Mar 5, 2023 4:35 pm IST

మన టాలీవుడ్ లో ఉన్నటువంటి మోస్ట్ లవబుల్ ఆన్ స్క్రీన్ జంటల్లో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు కియారా అద్వానీల జంట కూడా ఒకటని చెప్పాలి. తమ మొదటి సినిమా తోనే ఫలితం తో సంబంధం లేకుండా ఆడియెన్స్ లో ఈ జంట పై మంచి క్రేజ్ ఏర్పడింది. అయితే ఈ కాంబో మరో సారి అందులోని మావెరిక్ దర్శకుడు శంకర్ లాంటి దర్శకుని సినిమాకి టై అప్ అవ్వడం మరింత ఆసక్తిగా మారింది.

ఆల్రెడీ వీరు అయితే చాలా మేర షూటింగ్ చేయగా ఇప్పుడు లేటెస్ట్ గా చరణ్ పై కియారా పలు ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేయడం వైరల్ గా మారింది. చరణ్ తో వినయ విధేయ రామ తో వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉందని తనతో వర్క్ చేయడం ఎపుడూ బాగుంటుందని తెలిపింది. అంతే కాకుండా చరణ్ ఒక ఫైన్ యాక్టర్, సూపర్బ్ డాన్సర్ అని తెలిపింది. అలాగే RRR లాంటి సక్సెస్ అందుకున్నప్పటికీ తాను అదే గ్రౌండెడ్ గా ఉంటాడని చరణ్ పై కియారా తెలిపింది. దీనితో ఈ కామెంట్స్ వైరల్ గా మారాయి.

సంబంధిత సమాచారం :