బాలీవుడ్ సినిమాల పై స్టార్ హీరో షాకింగ్ కామెంట్స్ !

Published on Apr 24, 2022 7:44 pm IST

షార్ప్ అండ్ స్టైలిష్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా వచ్చిన `కేజీఎఫ్ చాప్టర్- 2` ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ రాబడుతూ దూసుకువెళ్తుంది. తాజాగా కన్నడ స్టార్ హీరో సుదీప్ కూడా ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం సుదీప్ చేసిన ఈ కామెంట్స్ బాగా వైరల్ అవుతున్నాయి.

మరి ఆ కామెంట్స్ ఏమిటో సుదీప్ మాటల్లోనే.. ‘ఓ కన్నడ చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా రూపొందించారని అందరూ అంటున్నారు. ఐతే, ఇక్కడ నేను చిన్న కరెక్షన్ చేయాలని నిర్ణయించుకున్నాను. హిందీ ఎంత మాత్రం జాతీయ భాషగా నేను అంగీకరించను. నేడు బాలీవుడ్ పాన్ ఇండియా సినిమాలను తీస్తోంది. ఆ సినిమాలతో తెలుగు, తమిళ భాషల్లో విజయం సాధించలేకపోతున్నారు. కానీ, ఈ రోజు మనం తెరకెక్కిస్తున్న సినిమాలను ప్రపంచం మొత్తం చూస్తోంది’ అంటూ సుదీప్ చెప్పుకొచ్చాడు.

సంబంధిత సమాచారం :