త్వరలో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా “కింగ్ ఆఫ్ కొత్త”

త్వరలో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా “కింగ్ ఆఫ్ కొత్త”

Published on Jan 6, 2024 2:53 AM IST


మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ అభిలాష్ జోషి దర్శకత్వం లో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ కింగ్ ఆఫ్ కొత్త. ఈ చిత్రం థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను అలరించడం లో విఫలం అయ్యింది. ఈ చిత్రం పేలవ ప్రదర్శన కనబరిచి, బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచింది. అయితే ఈ సినిమా ఇప్పుడు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లితెర ప్రేక్షకుల ముందుకు రానుంది.

త్వరలో ప్రముఖ టీవీ ఛానల్ అయిన స్టార్ మా మూవీస్ లో ప్రసారం కానుంది. శబీర్ కల్లరక్కల్, ఐశ్వర్య లక్ష్మీ, నైల ఉష, ప్రసన్న, గోకుల్ సురేష్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి జేక్స్ బెజొయ్, శాన్ రహ్మాన్ లు సంగీతం అందించారు. ఈ చిత్రం వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు